తిరుపతిలో అమరావతి రైతుల సభకి హైకోర్టు అనుమతి
తిరుపతిలో అమరావతి రైతుల సభకి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు సభకి హైకోర్టు అనుమతిచ్చింది.;
అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6గంటల లోపు సభ నిర్వహించుకోవచ్చని.. హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే కోవిడ్ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈనెల 17న తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. రైతులు బహిరంగ సభ నిర్వహించనున్నారు.