పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కౌంటింగ్‌కు సిద్ధమవుతున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం;
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పుతో కౌంటింగ్‌కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలు జరిగాయి. లెక్కింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు... ఆగస్ట్ 4న తీర్పును రిజర్వ్ చేసింది.