కొండెపిలో ఉద్రిక్తత... తోపులాటలో చిరిగిన టీడీపీ ఎమ్మెల్యే చొక్కా
టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తోపులాటలో ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగిపోయింది.;
ప్రకాశం జిల్లా కొండెపిలో టీడీపీ, వైసీపీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తోపులాటలో ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగిపోయింది. వైసీపీ రౌడీ రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టంగుటూరు హైవేపై నిరసన చేపట్టారు. దీంతో ఈ ఆందోళన అడ్డుకునేందుకు పోలీసుల్ని భారీగా మోహరించారు. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు తోపులాట జరగడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే స్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు.. టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైసీపీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది.