Fire Accident in Hospital: విశాఖలో అర్ధరాత్రి తృటిలో తప్పిపోయిన ఘోర ప్రమాదం..

అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో రాజుకున్న అగ్గి.. తృటితో తప్పిన ఘోర ప్రమాదం;

Update: 2024-07-30 02:15 GMT

 విశాఖలో అర్ధరాత్రి తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్గిరాజుకుంది. సెల్లార్ లోని యూపీఎస్ బ్యాటరీలు యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆసుపత్రి మొత్తం కమ్మేయడంతో రోగులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పరుగులు తీశారు. మరి కొంతమందిని అద్దాలు పగలగొట్టి బయటకు తరలించేందుకు ఏర్పాటు చేశారు ఆసుపత్రి సిబ్బంది.

సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. దట్టమైన పొగ కారణంగా మెడికవర్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన డిజాస్టర్ మేనేజ్మెంట్.. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకురాగలిగింది. అయితే దట్టమైన పొగ మాత్రం ఆసుపత్రి వెలుపల కమ్మేయడంతో జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ ను అప్రమత్తం చేసింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దగ్గర దాదాపు 5 గంటల ప్రయత్నం తర్వాత యూపీఎస్‌ బ్యాటరీ ఉన్న ప్రాంతాన్ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంది రెస్క్యూ టీమ్‌.. ఈ ప్రమాదం వల్ల రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని, వారిని తరలించాల్సిన అవసరం లేదని నిర్ధారించుకున్న తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో ఆసుపత్రుల భద్రతపై చర్చ జరుగుతుండగా మెడికవర్‌లో జరిగిన ప్రమాదం రెండవది.. కొద్దిరోజుల క్రితం జగదాంబ సెంటర్‌లోని ఇండస్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు అస్వస్థత గురయ్యారు. ఇప్పుడు మెడికవర్‌లో ప్రమాదం జరగా రోగుల వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.. దీంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News