HYDRAA: పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ కీలక చర్చ

ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే మార్పు సాధ్యమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్

Update: 2025-10-25 05:00 GMT

ప్ర­జ­ల్లో సరైన అవ­గా­హన కల్పిం­చి­న­ప్పు­డే ఎలాం­టి మా­ర్పు అయి­నా సా­ధ్య­మ­వు­తుం­ద­ని, ఆ ది­శ­గా తాము వి­జ­యం సా­ధిం­చా­మ­ని హై­డ్రా కమి­ష­న­ర్ ఏవీ రం­గ­నా­థ్ అన్నా­రు. ఒక­ప్పు­డు హై­డ్రా ఎం­దు­కు ఏర్పా­టైం­ది, దాని లక్ష్యా­లు ఏమి­టి అనే వి­ష­యా­ల­పై స్ప­ష్టత ఉం­డే­ది కా­ద­ని, కానీ ఇప్పు­డు చి­న్న పి­ల్ల­ల­కు కూడా చె­రు­వుల ఎఫ్‌­టీ­ఎ­ల్‌, బఫర్ జో­న్ల గు­రిం­చి వి­వ­రిం­చేంత చై­త­న్యం వచ్చిం­ద­ని ఆయన సం­తో­షం వ్య­క్తం చే­శా­రు. ప్ర­భు­త్వ లక్ష్యా­ల­ను ప్ర­జ­లు అర్థం చే­సు­కు­న్న­ప్పు­డే వ్య­వ­స్థ­లు వి­జ­య­వం­తం­గా పని­చే­స్తా­య­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. ‘మా­రు­తు­న్న ప్ర­పంచ పరి­స్థి­తు­ల్లో యు­నై­టె­డ్ నే­ష­న్స్ సె­క్యూ­రి­టీ కౌ­న్సి­ల్‌­లో సం­స్క­ర­ణల అవ­స­రం’ అనే అం­శం­పై గ్రీ­న్ పా­ర్కు హో­ట­‌­ల్‌­లో శు­క్ర­‌­వా­రం జ‌­రి­గిన స‌­ద­‌­స్సు­లో హై­డ్రా క‌­మి­ష­‌­న­‌­ర్ ఏవీ.రం­గ­‌­నా­థ్ ము­ఖ్య అతి­థి­గా పా­ల్గొ­ని ప్ర­‌­సం­గిం­చా­రు. సాం­స్కృ­తిక వా­ర­‌­స­‌­త్వ ప‌­రి­ర­‌­క్ష­‌­ణ­‌­తో పాటు.. ప‌­ర్యా­వ­‌­ర­‌ణ ప‌­రి­ర­‌­క్ష­‌­ణ­‌­కు ఐక్య­‌­రా­జ్య­‌­స­‌­మి­తి పె­ద్ద పీట వే­స్తుం­ద­‌­ని అన్నా­రు. ఆ ది­శ­‌­గా న‌­గ­‌­రం­లో మె­రు­గైన జీ­వ­‌న వి­ధా­నా­లు పెం­పొం­దిం­చేం­దు­కు హై­డ్రా ప‌ని చే­స్తోం­ద­‌­ని చె­ప్పా­రు. ఆ క్ర­‌­మం­లో­నే ఆక్ర­‌­మ­‌­ణ­‌ల తొ­ల­‌­గిం­పు.. చె­రు­వుల పు­న­‌­రు­ద్ధ­‌­ర­‌ణ కా­ర్య­‌­క్ర­‌­మా­ల­‌­ను పె­ద్ద­‌­యె­త్తున చే­ప­‌­ట్టా­మ­‌­ని అన్నా­రు.

ఈ ఏడా­ది భారీ వర్షా­లు కు­రి­సి­నా నగ­రా­న్ని వరదల నుం­చి కా­పా­డ­గ­లి­గా­మ­ని రం­గ­నా­థ్ తె­లి­పా­రు. చె­రు­వు­లు, వా­టి­ని అను­సం­ధా­నిం­చే నా­లా­ల­ను కా­పా­డు­కో­క­పో­తే నగ­రా­లు నీట ము­న­గ­డం ఖా­య­మ­ని హె­చ్చ­రిం­చా­రు. ప్యా­ట్నీ నా­లా­ను వి­స్త­రిం­చి, పూ­డిక తొ­ల­గిం­చ­డం ద్వా­రా దా­దా­పు 7 కా­ల­నీ­ల­కు వరద ము­ప్పు తప్పిం­చా­మ­ని గు­ర్తు­చే­శా­రు.

పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్‌ భేటీ

ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌­తో తె­లం­గాణ హై­డ్రా కమి­ష­న­ర్ ఏవీ రం­గ­నా­థ్ సమా­వే­శం అయ్యా­రు. మం­గ­ళ­గి­రి­లో­ని జన­సేన క్యాం­పు ఆఫీ­సు­లో వీరు ఇరు­వు­రు భేటీ అయ్యా­రు. దా­దా­పు రెం­డు గం­ట­ల­పా­టు వీ­రి­ద్ద­రి మధ్య సు­దీ­ర్ఘ సమా­వే­శం జరి­గిం­ది. కాగా.. వి­జ­య­వా­డ­లో జరి­గిన ఓ శు­భ­కా­ర్యా­ని­కి హా­జ­రైన రం­గ­నా­థ్.. మర్యా­ద­పూ­ర్వ­కం­గా పవన్ కళ్యా­ణ్ ను కలి­సి­న­ట్టు సమా­చా­రం.



Tags:    

Similar News