Raghuram Krishnam Raju : ఇంద్రకీలాద్రి అమ్మవారిని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు

Update: 2025-09-24 06:46 GMT

దేవి నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగా చేశారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు అన్నారు. బుధవారం ఆయన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. ఆయనతోపాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కూడా జగన్మాతను దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్నపూర్ణ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని చెప్పారు. దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అమ్మవారిని చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని రఘురాం కృష్ణరాజు వెల్లడించారు. మరోవైపు ఇంద్రకీలాద్రి అమ్మవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయంలో ఏర్పాటులో చాలా బాగున్నాయని తెలిపారు.

Tags:    

Similar News