Indrakeeladri: తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు

శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం;

Update: 2024-10-12 03:45 GMT

తెలుగురాష్ట్రాల్లో దసరా సందడి కనిపిస్తోంది. తెల్లవారు జామునుంచే ఇంద్రకీలాద్రి సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఇంద్రకీలాద్రి లో ఈరోజు రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో కనకదుర్గ దర్శమిస్తున్నారు. నేటితో దసర ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 కు పూర్ణాహుతి తో దసర నవరాత్రి ఉత్సవాలు సమాప్తం కానున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు కావటంతో ఇంద్రకీలాద్రి కి భక్తుల తాకిడి పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు . అంతేకాదు భవానీ మాల వేసుకున్న భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు 

బందీ అయిన పాలపిట్ట

విజయ దశమి రోజున పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని నమ్మకం. దీంతో స్వేచ్ఛగా తిరగాల్సిన పాలపిట్ట పంజరాల్లో బందీ అవుతోంది. కొందరు పాలపిట్టను పంజరంలో బంధించి రావణదహనం, జమ్మి బంగారం ఇచ్చి పుచ్చుకునే ప్రదేశాల్లో ప్రదర్శిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ క్రమంలో సరిగా ఆహారం, నీరు అందక డీహైడ్రేషన్‌తో అవి చనిపోతున్నాయి. దీనిపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండుగ వేళ పెరిగిన బంగారం ధరలు

దసరా పండుగ వేళ దేశీయ బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర పెరిగి రూ.70,960గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.77,410గా నమోదైంది. వెండి ధరలు సైతం పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,02,100కు చేరింది.

Tags:    

Similar News