Ys Jagan : రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయి : సీఎం జగన్
Ys Jagan : కడప జిల్లా కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను సీఎం జగన్ ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.;
Ys Jagan : కడప జిల్లా కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను సీఎం జగన్ ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం. 3వేల 164 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్. 801 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌లో కంపెనీలు 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌తో దాదాపు 14వేల 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో రాయల సీమ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు.