ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. స్టోన్ క్రషర్స్ యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి విడదల రజినీపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. అప్పటి మంత్రి రజినీ తమ నుంచి డబ్బులు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్స్ యాజమాన్యం హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేసింది. అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయా లని కోరగా హోంమంత్రి విచారణకు ఆదేశించారు