ఏపీ ఇంటర్ విద్యార్థుల ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. దీంతో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఏదో ఒక రోజు రెండు సంవత్సర ఫలితాలు అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. మార్చి 1వ తేదీతో పరీక్షలు ప్రారంభం కాగా.. 20వ తేదీతో ముగిశాయి. ఆ వెంటనే జవాబు పత్రాల వాల్యుయేషన్ కూడా ప్రారంభమైంది. ఇంటర్ ఫలితాలను సెల్ ఫోన్ లోని వాట్సప్ కు పంపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలిసారి వాట్సప్ కే మార్కులు వస్తాయని అధికారులు చెబుతుండటంతో అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.