Supreme Court : నేను చెప్పిందే సుప్రీం చెప్పింది.. ఐవైఆర్ సంచలన కామెంట్స్
తిరుమల లడ్డూపై తాను చేసిన వ్యాఖ్యలే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణా రావు వ్యాఖ్యానించారు. తాను తిరుపతి లడ్డూపై అన్ని కోణాలను వివిస్తూ ఒక వీడియో చేశాననీ.. అయితే తమకు అనుకూలంగా ఉన్న భాగాన్ని కట్ చేసి ఓ చానల్ వైరల్ చేసిందన్నారు. దాని ఆధారంగా కొందరు యూట్యూబర్లు పూర్తి వీడియో చూడకుండా తనపై విరుచుపడ్డారన్నారు.
ఇప్పుడు సుప్రీం కోర్టు మీద కూడా విరుచుకుపడతారా అని ప్రశ్నించారు ఐవైఆర్ కృష్ణా రావు. వాళ్లు చెప్పదలుచకున్న వరవడికి అనుకూలంగా అందరూ మాట్లాడాలంటే కుదురకపోవచ్చంటూ ఐవీఆర్‌కే రావు వరుస ట్వీట్లు చేశారు.