ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తనకు నమస్తే పెట్టాల్సి వస్తుందని జగన్ అసెంబ్లీకీ రావడం లేదని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ జగన్ కు సవాల్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జగన్ కు అహంకారం ఎక్కువనీ.. ఓడిపోయినా అది ఏమాత్రం తగ్గలేదని స్పీకర్ అన్నారు.