YS Jagan : వైసిపి నేతల అరాచకాలు.. వాటినే చూడాలా జగన్

Update: 2025-12-04 11:52 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం కోసం ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. కూటమి ఓవైపు అత్యద్భుతంగా ఏపీని డెవలప్ చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. దీనిపై ఆయన తాజాగా మాట్లాడుతూ దేశమంతా ఏపీ వైపు చూడాలని ఏపీలో ఏదో రాచకాలు జరిగిపోతున్నాయి అంటూ కామెంట్ చేశారు. నిజమే ఏపీలో అరాచకాలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. వైసిపి పార్టీ నేతలు చేసిన దారుణాలు కుంభకోణాలు అవినీతి ఇంకెవరు చేయలేదేమో. బహుశా జగన్ వాటిని చూడమని అంటున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే గత ఐదేళ్లలో జరిగినంత విధ్వంసం ఎన్నడూ జరగలేదు. అందుకే ఏపీ ప్రజలు అత్యంత దారుణంగా వైసీపీని ఓడించే కూటమికి పట్టం కట్టారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. వైసిపి హయాంలో ఒక్క అంతర్జాతీయ కంపెనీ ఏపీకి వచ్చిన చరిత్ర మనం చూశామా. కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటి అతిపెద్ద కంపెనీలు రావడం చేస్తున్నాం. ఇంత గొప్పగా పరిపాలన అందిస్తుంటే దీనిపై వైసీపీ ఏ స్థాయిలో బురద జల్లుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దేశమంతా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటుంది. జగన్ కు కూడా ఈ విషయం తెలుసు. కానీ ఏపీలో ఏదో జరుగుతోంది అన్నట్టు దేశమంతా ఇటు చూడాలని చెప్పడం ఏంటో మరి. ప్రస్తుతం వైసీపీ నేతల దారుణాలు అన్ని బయటకు వస్తున్నాయి.

తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కేసు, కల్తీ లిక్కర్ కేసు, మద్యం కుంభకోణం, పరకామణి కేసు లాంటివన్నీ వైసిపి నేతల మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు పవిత్రంగా కొలిచే తిరుపతి లడ్డును కల్తీ చేసిన పాపం వైసిపి నేతలది. ఇలా ఏపీ పరువు తీసిన జగన్ తాము చేసిన అరాచకాలను దేశమంతా చూడాలని అంటున్నారా అనే కామెంట్లు వస్తున్నాయి.

Tags:    

Similar News