జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా..!
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ తన వాదనలు వినిపించాల్సి ఉంది.;
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే, లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సమయం కావాలంటూ సీబీఐ మరోసారి కోర్టును కోరింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్యం కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని కోర్టుకి తెలిపింది సీబీఐ. దీంతో కేసు విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజు, జగన్ ఇప్పటికే లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.
బెయిల్ రద్దు పిటిషన్‌పై జరుగుతున్న విచారణలో.. విచక్షణ మేరకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ మొదట చెప్పుకొచ్చింది సీబీఐ. ఆ తరువాత తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని చెప్పింది. ఇందుకు పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును కోరింది సీబీఐ. దీనికి అంగీకరించిన సీబీఐ కోర్టు.. విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాదనల సమర్పణకు మరింత సమయం కావాలని కోరడంతో వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా పడింది.