అరటి రైతులపై జగన్ తప్పుడు ప్రచారం

Update: 2025-12-03 09:15 GMT

జగన్ ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నాడు. బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న ఆయన.. కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేస్తున్నాడు. నిజా నిజాలు తెలుసుకోకుండానే.. ఇష్టం వచ్చినట్టు ట్వీట్ చేస్తున్నాడు. ఇక తాజాగా అరటి రైతుల మీద తన విష ప్రచారాన్ని బయటపెట్టాడు. కిలో అరటి పళ్ళు 50 పైసలకు అమ్ముడుపోతున్నాయని.. అగ్గిపెట్టె, చాక్లెట్ల కంటే అరటి పళ్ళు చీప్ అయిపోయాయని.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అరటి రైతులు అప్పుల పాలు అవుతున్నారు అంటూ ఎక్కడలేని ప్రేమ వలస పోశాడు. అసలు జగన్ హయాంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులను పరామర్శించాలి అంటే పొలంలో సెట్లు వేయించుకొని.. రెడ్ కార్పెట్ల మీద నడిచొస్తూ దూరం నుంచే రైతులను మాట్లాడించిన చరిత్ర జగన్ ది. ఇప్పుడు అధికారం పోయేసరికి రైతుల మీద ఎక్కడలేని కపట ప్రేమను బయటపెడుతున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. జగన్ కంటే ముందే కూటమి ఎన్నడో అలర్ట్ అయి అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈసారి రాయలసీమ జిల్లాల్లో అరటి దిగుబడి ఎక్కువగా వచ్చింది.

మొన్న కురిసిన వర్షాలకు చాలా చోట్ల అరటి రైతులు నష్టపోయారు. వెంటనే కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు ట్రైడర్లు, ఎగుమతి దారులతో సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న పంటలను మార్కెట్ చేసేలా ఆదేశాలు ఇప్పించారు. ఆ వెంటనే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో కూడా చర్చలు జరిపారు. హర్యానాలోని కోల్డ్ స్టోరేజీల ఓనర్లతో మాట్లాడారు. దీంతో రాయలసీమ అరటిపళ్లకు నార్త్ ఇండియా మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రాయలసీమ నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటి పళ్ళు ఎగుమతి అయ్యాయి. ఒక్కో టన్నుకు 12 వేల నుంచి 14 వేల వరకు ధర పలికింది.

ఈ విషయాలను వివరిస్తూ జగన్ ట్వీట్ కు కూటమి ప్రభుత్వం కౌంటర్ వేసింది. అరటి రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డ విషయాలను కూడా బయటపెట్టింది. జగన్ అబద్ధాలు చెబితే కనీసం నమ్మేలా ఉండాలి అంటున్నారు కూటమినేతలు. ఎందుకంటే కిలో అరటి పళ్ళు ఎక్కడైనా 50 పైసలు ఉంటాయా. దెబ్బతిన్న అరటి పండ్లకు కొంత ధర తగ్గి ఉండొచ్చు. కానీ మరీ 50 పైసలకు ఉండటమేంటి. అరటి రైతులు కూడా జగన్ ట్వీట్ ను చూసి షాక్ అవుతున్నారు. పాపం జగన్ కు స్క్రిప్టు రాసి ఇచ్చిన వాళ్లు సరిగా లేరేమో. వెనక ముందు ఆలోచించకుండా.. పరువు పోతుందనే కనీస జ్ఞానం లేకుండా ట్వీట్ ను రెడీ చేసి జగన్ కు ఇస్తున్నారేమో. జగన్ అందులో ఏముంది అనేది కూడా పట్టించుకోడు కదా.. కూటమి మీద బురద జల్లుతే అంతే చాలు అని సంతోషపడే వ్యక్తి జగన్. ఈ దెబ్బతో జగన్ మరోసారి తన పరువు పోగొట్టుకున్నట్టే అంటున్నారు కూటమి నేతలు.

Tags:    

Similar News