Pavan Kalyan: మత్స్యకారులకు అండగా ఉంటాం
కాకినాడలో మత్స్యకారులతో పవన్‌కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.;
జగన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. జగన్ క్లాస్ వార్ చేస్తున్నారు.కొంతమందికి మాత్రమే సంపద వచ్చేలా చేశారని ఆరోపించారు. వైసీపీ వాళ్ళు స్వలాభం కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. దివిస్‌ను తరిమిస్తాం అన్నవారే అరబిందో తీసుకొచ్చారని అన్నారు. తానెక్కడికి పారిపోను పదేళ్లుగా మీ మధ్యనే ఉంటున్నా వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతివ్వండి, ట్రాన్సపరెన్సీ పాలన అంటే ఏంటో చూపిస్తానన్నారు. కాకినాడలో మత్స్యకారులతో పవన్‌కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆత్మీయ సమావేశానికి ముందు పవన్ కళ్యాణ్ బోటులో ప్రయాణించారు. ఏటిమొగ మత్స్యకారుల స్థితిగతులను తెలుసుకునేందుకు కాకినాడ తీర ప్రాంతం నుంచి నాలుగు కిలోమీటర్లు బోటులో వెళ్లారు. మత్స్యకారులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పవన్‌కళ్యాణ్.పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద తరిగిపోతోందని పవన్ దృష్టికి తీసుకొచ్చారు మత్స్యకారులు. సమస్యలను సావదానంగా విన్న పవన్ మత్స్యకారులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.