PAWAN: జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ప్రత్యేక సర్వే..!
సర్వేల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం;
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల పని తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలపై ప్రధానంగా ఈ సర్వే ద్వారా జనసేనాని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యం ఏ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉంది..? ఎవరు ఎక్కువ ఇసుక.. మద్యం.. ఇతర లావాదేవీల్లో ఉన్నారు..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలతో కూడిన సర్వే చేస్తున్నారట.. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలపై వరస విమర్శలు.. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ పరిణామాలపై సీరియస్‌గా ఉన్న పవన్ కల్యాణ్.. సర్వేకు ఆదేశాలు ఇచ్చారట. అయితే, ఈ సర్వే ఆధారంగా.. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్నర ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైనట్టుగా ప్రచారం సాగుతోంది.జనసేన ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పవన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.