వైసీపీ ప్రభుత్వ పని తీరుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు
జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు.;
తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో జనసేనపార్టీ సమావేశం నిర్వహించింది. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదేండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ప్రజలను దోచుకోవడానికి ఎంతకైనా దిగజారుతుందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు దివీస్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని ప్రగల్భాలు పలికిన నేటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని అన్నారు.. కాకినాడ సెజ్‌లో మీపాత్ర ఏంటో తేల్చాలని మంత్రి కన్నబాబుని ప్రశ్నించారు. ఈబీసీ రిజర్వేషన్ గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈబీసీ మహిళకు సంవత్సరానికి 15 వేల రూపాయలు చెల్లిస్తామని అంటూ కంటితుడుపు చర్యలు ఎవరిని నమ్మించడానికని ప్రశ్నించారు.