JANASENA: విశాఖలో మూడు రోజుల పాటు "సేనతో సేనాని"

Update: 2025-08-26 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖపట్నం 28 నుంచి 30 వరకు మూడు రోజుల విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. “సేనతో సేనాని” అనే పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి అంశాలపై చర్చలు, దిశానిర్దేశం జరుగుతుంది. సుమారు 15,000 మంది నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మొదటి రోజు YMCAలో ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సీలు సమావేశం, మధ్యాహ్నం రాష్ట్రస్థాయి కార్యకర్తలతో చర్చలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో సమావేశాలు జరుగుతాయి. రెండవ రోజు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, జిల్లా నాయకుల చర్చలు ఉంటాయి. మూడవ రోజు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగసభ ద్వారా పార్టీ భవిష్యత్ విధానాలు, కూటమి ప్రభుత్వంతో సమన్వయం, కార్యకర్తల బలోపేతంపై పవన్ దిశానిర్దేశం ఇస్తారు.

 తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం'

తుడా టవర్స్‌ను జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టౌన్‌ప్లానింగ్ క్రమపద్ధతిగా లేకపోవడంతో సమస్యలు ఏర్పడినట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం నిర్మాణ అనుమతుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందని, నిబంధనల సరళీకరణతో అందరికీ మేలు జరగనుందని చెప్పారు. టీడీఆర్ బాండ్ల సమస్యపై కూడా వివరాలు వెల్లడిస్తూ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 368 బాండ్లలో 59 న్యాయ సమస్యల కారణంగా అడ్డుపడినట్లు, వీటిని వీలైనంత త్వరగా క్లియర్ చేయడం లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. తిరుపతిని మెగాసిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు మంత్రి అన్నారు.

Tags:    

Similar News