JOGI RAMESH: అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత జోగి రమేష్‌

నకిలీ మద్యం కేసు.. కీలక మలుపులు

Update: 2025-10-19 04:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో జరిగిన నకిలీ మద్యం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు వీడియోలో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. జోగి రమేష్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు . తాను జనార్ధన రావును ఎప్పుడూ కలవలేదని, ఈ వీడియో బలవంతంగా తీయించినదని పేర్కొన్నారు. తర్వాత జనార్దన్ రావుతో.. మాజీ మంత్రి చేసిన వాట్సాప్ చాట్ వైరల్ అయింది. అయితే అది ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాజాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు. జగన్మోహన్ అనే వ్యక్తులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఎప్పుడూ కలవలేదని జోగి రమేష్ చెబుతున్నారని..ఈ ఫోటోలేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వై­సీ­పీ నేత జోగి రమే­ష్‌ మరో­సా­రి అడ్డం­గా దొ­రి­కి­పో­యా­రు. నకి­లీ మద్యం కే­సు­లో ఏ-1 నిం­ది­తు­డు జనా­ర్ధ­న్‌­రా­వు, ఆయన సో­ద­రు­డు జగ­న్‌ మో­హ­న్‌­రా­వు­ల­తో కలి­సి వే­డు­క­ల్లో పా­ల్గొ­న్న జోగి రమే­ష్ ఫొ­టో­లు బయ­ట­కు వచ్చా­యి. మొ­న్న జనా­ర్ధ­న్‌­రా­వు వాం­గ్మూ­లం, ని­న్న వా­ట్సా­ప్‌ చా­ట్‌, నేడు ఫొ­టో­లు .. ఇలా నకి­లీ మద్యం కే­సు­లో జనా­ర్ధ­న్‌­రా­వు- జోగి రమే­ష్‌ మధ్య లిం­కు­లు బయ­ట­ప­డు­తు­న్నా­యి. జోగి రమే­ష్ ప్రో­ద్భ­లం­తో­నే నకి­లీ మద్యం తయా­రు చే­సి­న­ట్టు ఇప్ప­టి­కే జనా­ర్ధ­న్‌­రా­వు ఎక్సై­జ్‌ పో­లీ­సు­ల­కు వాం­గ్మూ­లం ఇచ్చా­రు. ప్ర­భు­త్వా­న్ని అప్ర­తి­ష్ట­పా­లు చే­సేం­దు­కే నకి­లీ మద్యం చే­సి­న­ట్టు తె­లి­పా­రు. ఏపీ­లో మద్యం కుం­భ­కో­ణం పెను ప్ర­కం­ప­న­లు రే­పు­తోం­ది. ఈ మద్యం కేసు మొ­త్తం జోగి రమే­ష్ చు­ట్టూ­నే తి­రు­గు­తోం­ది. కూ­ట­మి సర్కా­ర్‌­ను అప­ఖ్యా­తి పాలు చే­సేం­దు­కే జోగి ఈ మద్యం కుం­భ­కో­ణం చే­శా­డ­ని తె­లు­స్తోం­ది.

Tags:    

Similar News