Jogi Ramesh : బయటకొస్తున్న జోగి రమేశ్ అక్రమాలు..

Update: 2025-11-03 11:41 GMT

కల్తీమద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన నిందితుడిగానే ఉన్నాడు. ఇప్పుడు కల్తీమద్యం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత గతంలో జోగి రమేశ్ ఎంత పెద్ద అక్రమాలల్లో ఉన్నారనేది మరోసారి తెరమీదకు వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అప్పటి మాజీ సీఎం చంద్రబాబు ఇంటిమీదకే రౌడీలను వేసుకుని వెళ్లి అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఆ దారుణంతో జగన్ ను మెప్పించి మంత్రి పదవి కొట్టేశారు. ఇక మంత్రి పదవి వచ్చాక అడ్డూ అదుపు లేకుండా స్కామ్ లు చేసి వందల కోట్లు సంపాదించుకున్నారు.

ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ కుంభకోణంలో జోగిరమేశ్ కీలక సూత్రధారి, పాత్రధారి. విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కీలక పాత్ర పోషించారు. అగ్రిగోల్డ్ భూములను కొట్టేసి.. పక్కనే ఉన్న సర్వే నెంబర్ లో భూములు కొన్నట్టు చూపించి.. తర్వాత నెంబర్లు మార్చేసి కోట్లు విలువ చేసే 2వేల గజాల స్థలాన్ని కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు జోగి రమేశ్. అంబాపురంలో ప్రభుత్వం జప్తు చేసిన నిషేధిత భూమిలను పక్కనున్న రీ సర్వే నెంబర్ వేసి జోగి రాజు, వెంకటేశ్ పేరుతో ఆర్ ఎస్ 87లో ఉన్న భూమిని 88లో చూపిస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి 9 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత వీటిని సామాన్యులను నమ్మించి అమ్మేశారు.

ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యే బూడిదను కూడా మింగేశారు జోగి రమేశ్. ఈ బూడిద వ్యవహారంలో తన అనుచరులతో దందా చేయించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. కల్తీమద్యం కేసును కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వాడాలనుకున్నాడు. అద్దేపల్లి జనార్ధన్ రావును ఇరికించాలని చూస్తే.. చివరకు జోగి రమేశ్ అడ్డంగా దొరికిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక జోగి రమేశ్ అక్రమాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినా సరే ప్రజల్లో గానీ.. అటు సొంత వైసీపీ పార్టీలో గానీ పెద్దగా సానుభూతి కనిపించట్లేదు.

Tags:    

Similar News