AP : న్యాయమూర్తి కుమారుడికి సివల్స్ లో 94వ ర్యాంక్

Update: 2025-04-23 14:15 GMT

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురానికి చెందిన చెక్కా స్నేహిత్ ఆల్ ఇండియా 94వ ర్యాంకు సాధించాడు. స్నేహిత్ మ్యాథ్స్ మెయిన్ ఈ ఘనత సాధించాడు. పిఠాపురంలో జన్మించిన స్నేహిత్ ప్రాధమిక విద్య స్థానిక ఆదర్శ విద్యాలయలో సాగింది. అనంతరం ఇంటర్ వరకూ గుంటూరు భాష్యం విద్యాసంస్థల్లో కొనసాగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నాడు. ఐఐటీ గాంధీ నగర్లో చదివాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సొంతంగానే సిద్దపడినట్లు స్నేహిత్ తెలిపాడు. సివిల్ సర్వీసెస్ ద్వారా పేదలకు, దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యంగా చెప్పాడు.

స్నేహిత్ ర్యాంకు ఆధారంగా ఐపీఎస్ కు సెలక్ట్ కావొచ్చని చెబుతున్నారు. అతని తండ్రి చక్కా వెంకట్ స్థానిక పూర్ణ అన్నపూర్ణ థియేటర్ల ఓనర్, ఏలూరులో శరవణ జువెలరీ నిర్వహిస్తున్నారు. తల్లి మాధురి కుముదిని గుంటూరు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. స్నేహిత్ తమ్ముడు సుశాంత్ లా చేస్తున్నాడు స్నేహిత్ సాధించిన విజయం పట్ల పిఠాపురం అసోసియేషన్ సభ్యులు, హర్షం వ్యక్తం చేశారు. ఐపిఎస్ అధి కారిగా ప్రజలకు మెరుగైన సేవలు ' అందించాలని వారు ఆకాంక్షించారు.

Tags:    

Similar News