ఇన్నాళ్లకు దొరికిన విజయ్ భాస్కర్ రెడ్డి.. తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రదర్..
జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ యాక్టివిట్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూశాం. మహిళలను టార్గెట్ చేశారు. అత్యంత నీచంగా మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వైసీపీ బ్యాచ్ ఇలాంటి పోస్టులు చేశారు. ఇలా విదేశాల్లో ఉండి పోస్టులు చేసిన వారి పని పడుతోంది కూటమి ప్రభుత్వం. మళ్లపాటి విజయ్ భాస్కర్ రెడ్డి లండన్ లో ఉండి దరిద్రమైన పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై విచక్షణారహితంగా పోస్టులు పెట్టారు. అలాగే లోకేష్, చంద్రబాబును తిడుతూ పోస్టులు పెట్టారు. ఈ భాస్కర్ తండ్రి చనిపోవడంతో ఏపీకి వచ్చాడు. మరి పోలీసులు ఊరుకోరు కదా.
అంత్యక్రియలు పూర్తయ్యేదాకా వెయిట్ చేసి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అటు వైసీపీ నేత కొండారెడ్డి కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇలా వైసీపీ బ్యాచ్ మొత్తం దరిద్రమైన పనులు చేస్తూ అరెస్ట్ అవుతున్నారు. అయినా సరే జగన్ వీరిని ఏమీ అనరు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా.. జగన్ ఇలాంటి వారినే తన పార్టీలో పెట్టుకుని ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటారు. ఇలాంటి వారితో చంద్రబాబును, లోకేష్ ను, భువనేశ్వరిని తిట్టించి పైశాచిక ఆనందం పొందడం జగన్ కు అలవాటు అయిపోయింది. అందుకే వీరికి పార్టీలో అత్యంత కీలకమైన పొజీషన్ ఇస్తుంటారు. తప్పు చేసిన వారు సొంత పార్టీ నేతలైనా చర్యలు తీసుకునే చంద్రబాబు ఎక్కడ.. తప్పులు చేస్తున్నా సరే ఎంకరేజ్ చేసే జగన్ ఎక్కడ.
ఇలాంటి వారితో మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ అనుకోవడం నిజంగా దారుణమే. ఎందుకంటే ప్రజలకు మంచి చేసే వారిని పార్టీలో ఎంకరేజ్ చేస్తే ప్రజలు గుర్తిస్తారు. లేదంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే సపోర్ట్ చేయాలి. ప్రజలకు అన్యాయం చేస్తుంటే.. ఆడవారిపై అరాచకమైన పోస్టులు పెడుతుంటే జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత నిందలకు దిగే వారిని జగన్ కంట్రోల్ చేసిన చరిత్రనే లేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎక్కడో విదేశాల్లో ఉండి దిక్కుమాలిన పోస్టులు పెట్టి తప్పించుకుంటున్నాం అనుకుంటే పొరపాటే. పాపం పండినప్పుడు చేసిన తప్పులకు శిక్షలు తప్పవు.