AP High Court : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ ప్రమాణం
ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ప్రమాణం చేయించారు. తుహిన్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. తుహిన్ కుమార్ స్వస్థలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటి గ్రామం. 1994 మార్చి 9న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదైంది. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలు అందించారు. 2010-14 మధ్య జీఎంసీ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016-17లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.