kavitha: బీజేపీ ఎంపీలూ.. రాజీనామా చేయండి
జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్.. రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం.. అర్వింద్ ఆరోపణలపై కవిత ఆగ్రహం
గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి తుమ్మల వల్లే ముంపు ముప్పు ఉందని తెలిపారు. మొక్క రైతులకు బోనస్ చెల్లించి, కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తడిసింది, తడిసిన ధాన్యం కడ్తా లేకుండా కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ ఎంపీ ఉన్నా.. లేనట్టే అని విమర్శించారు. మాధవనగర్ బ్రిడ్జి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ఎంపీ అరవింద్ చెప్పాలన్నారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుంది.. బీజేపీ ఎంపీ తన కుటుంబం ఎంపీ లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చిట్టా బయట పెడతా అని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుందని చెప్పుకొచ్చారు. అతని చిట్టా త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను అణచి వేస్తోందని ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం జనంబాట పట్టానని ఉద్ఘాటించారు. ప్రతీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడతానని వివరించారు. మునిగిపోయే పడవ కాంగ్రెస్తో తనకేం ఏం సంబంధమని కవిత ప్రశ్నించారు.
ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇంకా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని కవిత అన్నారు. అందరి తెలంగాణ కావాలని.. కొందరి తెలంగాణ మాత్రమే కావొద్దు అనేది తన లక్ష్యం అని పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో తనకు తెలియదన్నారు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని తనను బయటకు పంపిందాన్ని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని కవిత స్పష్టం చేసారు. అన్నదాతలకి ఎకరానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న రైతులు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం మంది రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి ఆలోచించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో అన్నదాతలు క్వింటాకు రూ.700 నష్టపోయారని వాపోయారు.