Kesineni Nani: సోదరుడిపై ఎంపీ కేశినేని నాని కేసు.. వివరణ ఇచ్చిన చిన్ని..
Kesineni Nani: కేశినేని కుటుంబంలో విభేదాలు మరింత ముదిరాయి. సోదరుడు శివనాథ్‌పై MP నానీ ఏకంగా పోలీసు కేసు పెట్టారు.;
Kesineni Nani: కేశినేని కుటుంబంలో విభేదాలు మరింత ముదిరాయి. సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్నిపై MP నానీ ఏకంగా పోలీసు కేసు పెట్టారు. తన హోదాను, పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇప్పటికే పోలీసులకు, అలాగే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కంప్లైట్ చేశారు. తన కారుకు వాడే VIP స్టిక్కర్‌ను పోలిన నకిలీ స్టిక్కర్ వాడుతూ కొందరు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
దాదాపు రెండు నెలలుగా రగులుతున్న ఈ వివాదం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి చేరడంతో.. కేశినేని చిన్ని ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తాను ఎక్కడా నానీతో విభేదించలేదని వివరణ ఇచ్చారు. కేసు పెట్టి ఆయనే తన కుటుంబాన్ని వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో తానో సామాన్య కార్యకర్తనని చెప్పిన చిన్నీ.. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఎంపీ కేశినేని నానీ మే నెలలోనే సోదరుడిపై పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జూన్ 2వ వారంలో FIR కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో చిన్నీని ఆపిన పోలీసులు కమిషనర్ ఆఫీస్‌కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు. ఐతే.. పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని చిన్ని చెప్తున్నారు. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని వివరణ ఇస్తున్నారు. ఇదివ్యక్తిగత విభేదాల వల్లే తప్ప.. దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు చిన్ని.