AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. 10 నిమిషాలు ఆగితే..
AP 3 Capitals Bill: జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.;
Kodali Nani (tv5news.in)
AP 3 Capitals Bill: మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
- జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు
- మూడు రాజధానుల బిల్లులో టెక్నికల్ సమస్యలు ఉన్నాయ్
- టెక్నికల్ సమస్యలతో న్యాయస్థానంలో నిలువలేకపోతున్నాయి
- పది నిమిషాలు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కామెంట్
- మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో వెళ్తోందట
- ప్రభుత్వ నిర్ణయం రైతులను మోసం చేసే రీతిలోనే ఉన్నాయి: విపక్షాలు
జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మూడు రాజధానుల బిల్లులో టెక్నికల్ చాలా సమస్యలు ఉన్నాయని, టెక్నికల్ సమస్యల కారణంగా న్యాయస్థానంలో బిల్లులు నిలువలేకపోతున్నాయని అన్నారు. పది నిమిషాలు ఆగితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందంటూ కామెంట్ చేశారు. దీంతో మూడు రాజధానుల అంశంపై జగన్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో వెళ్తోందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ రైతులను మోసం చేసే రీతిలోనే ఉన్నాయంటూ విపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి.