సీఎం జగన్ తన పుట్టినరోజుకు తానే కానుక ఇచ్చుకుని ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు : పట్టాభి
వైఎస్సార్ జగనన్న భూరక్ష పథకం భూభక్ష పథకంగా మార్చారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్;
వైఎస్సార్ జగనన్న భూరక్ష పథకం భూభక్ష పథకంగా మార్చారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ప్రభుత్వ, ప్రజల భూములను కొట్టేసేందుకు సరికొత్తగా పథక రచన చేశారన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున భూవివాదాల సృష్టించి, వాటి పరిష్కారం పేరుతో భూముల భక్షణ చేయాలన్నదే వైసీపీ నేతల ఆలోచనన్నారు పట్టాభి. వైసీపీ నేతలు ఎవరైనాసరే, మీ భూమిని కబ్జాచేయాలని చూస్తే, వెంటనే స్థానిక టీడీపీ నేతల్ని సంప్రదించాలన్నారు. వైసీపీ నేతల నుంచి ప్రజల భూమిని రక్షించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు పట్టాభి