KONASEEMA: కోనసీమలో మావోయిస్టుల కలకలం

హిడ్మా అనుచరుడు అరెస్ట్

Update: 2025-11-20 03:30 GMT

ఏపీ­లో వరుస మా­వో­యి­స్టుల ఎన్‌­కౌం­ట­ర్ల నే­ప­థ్యం­లో పో­లీ­సు­లు అప్ర­మ­త్త­మ­య్యా­రు. ము­ఖ్యం­గా ఏజె­న్సీ ప్రాం­తా­లు, గో­దా­వ­రి జి­ల్లా­ల్లో ఊరూర జల్లెడ పడు­తు­న్నా­రు. వి­జ­య­వాడ, వి­శాఖ, కా­కి­నాడ, వి­జ­య­న­గ­రం ప్రాం­తా­ల్లో మా­వో­యి­స్టు­లు అరె­స్ట్ కా­వ­డం­తో.. ఇంకా ఎం­త­మం­ది ప్ర­జ­ల్లో ఉన్నా­ర­న్న దా­ని­పై ఫో­క­స్ పె­ట్టా­రు. ఈ నే­ప­థ్యం­లో డా­క్ట­ర్ బీ­ఆ­ర్ అం­బే­ద్క­ర్ కో­న­సీమ జి­ల్లా రా­వు­ల­పా­లెం­లో మా­వో­యి­స్ట్ అగ్ర­నేత హి­డ్మా అను­చ­రు­డి­ని పో­లీ­సు­లు అరె­స్ట్ చే­శా­రు. హి­డ్మా అను­చ­రు­డు మా­ధ­వి­హం­డా సరో­జ్ రా­వు­ల­పా­లెం­లో ఉన్న­ట్లు గు­ర్తిం­చిన పో­లీ­సు­లు.. అత­న్ని అరె­స్ట్ చేసి వి­చా­రణ చే­స్తు­న్నా­రు. ఛత్తీ­స్ గఢ్ కు చెం­దిన సరో­జ్ రా­వు­ల­పా­లెం ఎం­దు­కు వచ్చా­రు? ఆప­రే­ష­న్ కగా­ర్, తె­లం­గా­ణ­లో మా­వో­యి­స్టుల లొం­గు­బా­టు నే­ప­థ్యం­లో షె­ల్ట­ర్ కో­స­మే మా­వో­యి­స్టు­లు ఏపీ­కి వచ్చా­రా? లేక మరే­దై­నా కా­ర­ణం ఉందా? అన్న కో­ణం­లో ఆరా తీ­స్తు­న్నా­రు.

ఇద్దరు మహిళా మావోలు అరెస్ట్

ప్రాం­తం­లో పో­లీ­సు­లు ఇద్ద­రు మహి­ళా మా­వో­యి­స్టు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. ఈ ఇద్ద­రు మహి­ళ­లు PLGA టాప్ లీ­డ­ర్ హి­డ్మా­కు సె­క్యూ­రి­టీ­గా పని­చే­స్తుం­డ­గా, హి­డ్మా ఎన్‌­కౌం­ట­ర్ అనం­త­రం కా­కి­నాడ వైపు వె­ళ్తుం­డ­గా పో­లీ­సు­లు వా­రి­ని పట్టు­కు­న్నా­రు. ఇద్ద­రు మహి­ళా మా­వో­యి­స్టు­ల­ను అం­కిత మరి­యు అనూ­ష­గా గు­ర్తిం­చా­రు. ఈ ఇద్ద­రు మహి­ళా మా­వో­యి­స్టు­ల­ను వి­జ­య­వా­డ­కు తర­లిం­చా­రు. ఈ ఇద్ద­రు మా­వో­యి­స్టు­లు ఏజె­న్సీ ప్రాం­తం నుం­చి శం­క­వ­రం, రౌ­తు­ల­పూ­డి మా­ర్గం ద్వా­రా కా­కి­నాడ వె­ళ్లేం­దు­కు ప్ర­య­త్ని­స్తుం­డ­గా.. పో­లీ­సు­ల­కు చి­క్కా­రు. హి­డ్మా పై జరి­గిన ఆప­రే­ష­న్ల తర్వాత మా­వో­యి­స్టుల షె­ల్ట­ర్ జో­న్ల­పై కొ­న­సా­గు­తు­న్న దా­డు­ల­లో భా­గం­గా ఈ మహి­ళ­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కో­వ­డం జరి­గిం­ది. వా­రి­ని వి­చా­రిం­చి మరి­న్ని ము­ఖ్య సమా­చా­రం పొం­దేం­దు­కు అధి­కా­రు­లు చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­రు. వరుస అరెస్టులతో ఏపీలో టెన్షన్ నెలకొంది.

మావోయిస్టులూ లొంగిపోండి: మ‌ల్లోజుల వేణుగోపాల్ పిలుపు

ఏపీ ఏజె­న్సీ ప్రాం­తం­లో వరుస ఎన్‌­కౌం­ట­ర్ల నే­ప­థ్యం­లో మా­వో­యి­స్టు దళ మాజీ సభ్యు­డు మల్లో­జుల వే­ణు­గో­పా­ల్‌ వీ­డి­యో సం­దే­శం వి­డు­దల చే­శా­రు. ఇప్పు­డు సమా­జం మా­రిం­ద­ని, పరి­స్థి­తు­ల­ను అర్థం చే­సు­కు­ని తాము ఆయు­ధా­ల­ను వీ­డా­మ­ని వి­వ­రిం­చా­రు. మి­గ­తా దళ సభ్యు­లు కూడా ఆయు­ధా­ల­ను వీడి జన­జీ­వన స్ర­వం­తి­లో కల­వా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. లొం­గి­పో­యే దళ సభ్యు­లు తనను సం­ప్ర­దిం­చొ­చ్చ­ని చె­ప్పా­రు. తన ఫో­న్‌ నం­బ­ర్‌ 8856038533 తె­లి­య­జే­శా­రు. శం కూడా మా­రు­తోం­ది. ఎన్‌­కౌం­ట­‌­ర్ల­‌­లో మా­వో­యి­స్టు­లు ప్రా­ణా­లు కో­ల్పో­తు­న్నా­రు. ఎన్‌­కౌం­ట­‌­ర్‌­లో హి­డ్మా­తో పాటు ప‌­లు­వు­రి ప్రా­ణా­లు పో­యా­యి. మా­వో­యి­స్టు­లు ప్రా­ణా­లు కో­ల్పో­వ­‌­డం బాధ క‌­లి­గిం­చిం­ది అని మ‌­ల్లో­జుల పే­ర్కొ­న్నా­రు. మా­వో­యి­స్టు­లు జన జీవన స్ర­వం­తి­లో కలి­సి ప్ర­జా ఉద్య­మా­లు చే­యా­ల­ని మల్లో­జుల పి­లు­పు­ని­చ్చా­రు. దేశ ప్ర­గ­తి­లో భా­గ­స్వా­ము­ల­వ్వా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు

Tags:    

Similar News