కర్నూలు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మరింత ముదిరాయి.. ఎమ్మెల్యే సుధాకర్‌పై పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.. వైసీపీ కార్యకర్తలను పక్కన పెడుతూ టీడీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ ఆరోపించారు.. ఎన్నికల్లో ఓడించేందుకు పోలింగ్ బూత్‌ల దగ్గర డబ్బు పంపిణీ చేయాలని ప్రయత్నించిన వ్యక్తులను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించడం పార్టీలో కలకలం రేపింది.. ఎమ్మెల్యే సుధాకర్ తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.