Kuppam Elections: ఎన్నికల కోసం తమిళనాడు నుండి కుప్పానికి దొంగ ఓటర్లు..
Kuppam Elections: కుప్పంలో దొంగ ఓటర్లు బరితెగిస్తున్నారు. తమిళనాడు నుంచి ఏకంగా 60 మంది దొంగ ఓటర్లు కుప్పం చేరుకున్నారు.;
Kuppam Elections (tv5news.in)
Kuppam Elections: కుప్పంలో దొంగ ఓటర్లు బరితెగిస్తున్నారు. తమిళనాడు నుంచి ఏకంగా 60 మంది దొంగ ఓటర్లు కుప్పం చేరుకున్నారు. వీరిని పూల మార్కెట్ దగ్గర టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. బస్సు టైర్లలో గాలి తీసి దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించారు. ఐతే.. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకుంటే.. ఊరి చివర వదిలేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.