KUPPAM: కుప్పం అభివృద్ధికి ఆరు ఎంవోయూలు

అభివృద్ధి దిశగా కుప్పం

Update: 2025-08-31 05:00 GMT

కు­ప్పం ప్రాంత అభి­వృ­ద్ధి కోసం ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు సమ­క్షం­లో 6 ఎం­ఓ­యూ­లు కు­ది­రా­యి. కు­ప్పం పరి­ధి­లో వ్య­ర్ధాల నుం­చి సంపద కా­ర్య­క్ర­మం అమలు కోసం ఏజీ­ఎ­స్-ఐటీ­సీ­తో ఒప్పం­దం కు­ది­రిం­ది. వ్య­ర్ధాల సు­స్థిర ని­ర్వ­హ­ణ­పై ఇం­టిం­టి ప్ర­చా­రం, పా­ఠ­శా­ల­ల్లో అవ­గా­హ­నా కా­ర్య­క్ర­మా­ల­ను 15 ఏళ్ల పాటు ని­ర్వ­హిం­చే­లా ఒప్పం­దం­జ­రి­గిం­ది. మహి­ళా పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­ను తయా­రు­చే­య­టం, మహి­ళా సం­ఘా­లు తయా­రు చే­సిన ఉత్ప­త్తు­ల­కు గ్రా­మీణ ప్రాం­తా­ల్లో మా­ర్కె­టిం­గ్ అం­శా­ల­పై షీ­లీ­డ్స్ సం­స్థ­తో ప్ర­భు­త్వం ఒప్పం­దం చే­సు­కుం­ది. కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గం­లో 10వేల మంది మహి­ళ­ల్ని ఔత్సా­హిక పా­రి­శ్రా­మిక వే­త్త­లు­గా తయా­రు చే­య­టం­తో పాటు గ్రా­మీణ మా­ర్కె­ట్ల­ను అం­ది­పు­చ్చు­కు­నే­లా శి­క్షణ ఇచ్చేం­దు­కు ఎం­ఓ­యూ చే­సు­కుం­ది.

బెం­గు­ళు­రు­కు చెం­దిన స్పే­స్ టె­క్నా­ల­జీ సం­స్థ ఎత్రె­యా­ల్ ఎక్ప్ ప్లో­రే­ష­న్ గి­ల్డ్ సం­స్థ­తో ప్ర­భు­త్వం అవ­గా­హన ఒప్పం­దం కు­ది­రిం­ది. మీ­డి­యం లి­ఫ్ట్ లాం­చిం­గ్ రా­కె­ట్ రే­జ­ర్ క్రె­స్ట్ ఎంకె-1 తయా­రీ ఫ్యా­క్ట­రీ ఏర్పా­టు కోసం ఎత్రె­యా­ల్ ఒప్పం­దం చే­సు­కుం­ది. రూ.500 కో­ట్ల పె­ట్టు­బ­డి­ని మూడు దశ­ల్లో పె­ట్టే­లా కా­ర్యా­చ­రణ, మొ­త్తం 500 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి. అగ్రి­టె­క్, ఫుడ్ ప్రా­సె­సిం­గ్ హబ్ ఏర్పా­టు చే­సేం­దు­కు రెడ్ బె­ర్రీ ఫుడ్ లా­జి­స్టి­క్స్ తో ఎం­ఓ­యూ కు­ది­రిం­ది. రూ.300 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో 15 వేల మం­ది­కి ఉపా­ధి కల్పిం­చే­లా ప్ర­తి­పా­దన సమ­ర్పిం­చిం­ది. మా­మి­డి, జామ, టమా­టో పల్పిం­గ్ యూ­ని­ట్ల­ను ఈ సం­స్థ ఏర్పా­టు చే­య­నుం­ది.

Tags:    

Similar News