Tirupati : తిరుపతిలో దాడికి యత్నించిన చిరుత… వీడియో వైరల్

Update: 2025-07-26 07:15 GMT

తిరుపతిలో ఇటీవల కాలంలో చిరుతల సంచారం, దాడుల ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ఒక మహిళపై చిరుత దాడికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. అలిపిరి-ఎస్వీ పార్క్‌ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై ఒక్కసారిగా దాడికి చిరుత యత్నించింది. అయితే అదృష్టవశాత్తూ వారు తృటిలో తప్పించుకోగా.. కాగా, ప్రమాద సమయంలో బైకర్ల వెనుక వెళ్తున్న కారులో ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లో ఈ విజువల్స్ ను రికార్డు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేసి, ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచారు. యాత్రికులు మరియు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించవద్దని అధికారులు సూచిస్తున్నారు.

తిరుమల కొండ పరిసరాల్లో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News