Lokesh : అక్రమ కేసులు పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నాడు : నారా లోకేష్
Lokesh : కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్‌కి బుద్ది రావడం లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్;
Lokesh : కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా జగన్ సర్కార్‌కి బుద్ది రావడం లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చుకున్నారని.. బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా.. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటికి ఎలాంటి నోటీసులు లేకుండా.. ఏపీ పోలీసులు వెళ్లి అక్రమ అరెస్ట్‌కు యత్నించడం దారుణమన్నారు.
ఎందుకు వచ్చారో చెప్పకుండా ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు..ఇంట్లో పనిచేసే వారిపై బెదిరింపులకు పాల్పడటం ఖండిస్తున్నామని లోకేష్ అన్నారు. నేరాలు-ఘోరాలు చేస్తున్న వైసీపీ నేతలకు.. ప్రభుత్వం సన్మానాలు చేసి పదవులు కట్టబెడుతుందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ నేతలపై.. అక్రమ కేసులు పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వైసీపీ అధికార మదాన్ని అణిచివేస్తామన్నారు.