ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న లోకేశ్.. మోదీతో పాటు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేశ్ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు. ఈరోజే లోకేశ్ తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. అమరావతిలో జరగనున్న టీచర్స్ డేలో పాల్గొంటారు.
జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నాం
జీఎస్టీలో భాగంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటివి వృద్ధికి దోహదపడే సానుకూల నిర్ణయాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశ పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.