LOKESH: వైసీపీ కార్యకర్తకు నారా లోకేశ్ అండ

Update: 2025-09-14 07:30 GMT

మం­త్రి నారా లో­కే­ష్ రా­జ­కీ­యా­ల­కు అతీ­తం­గా వ్య­వ­హ­రిం­చి మంచి మన­సు­ను చా­టు­కు­న్నా­రు. ఒక వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ కా­ర్య­క­ర్త సీ­ఎం­ఆ­ర్ఎ­ఫ్ సహా­యం కోసం ట్వీ­ట్ చే­య­గా, లో­కే­ష్ వెం­ట­నే స్పం­దిం­చి సాయం చే­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు. దీ­ని­పై తె­లు­గు­దే­శం కా­ర్య­క­ర్త­లు లో­కే­ష్‌­ను ప్ర­శం­సిం­చా­రు. 'నా­రా లో­కే­ష్ గా­రి­కి ఒక రి­క్వె­స్ట్.. సీ­ఎం­ఆ­ర్‌­ఎ­ఫ్ వి­ష­యం­లో మీ సపో­ర్ట్ కా­వా­లి. మా దగ్గర అవ­స­ర­మైన అన్ని మె­డి­క­ల్ బి­ల్లు­లు ఉన్నా­యి.. వా­టి­ని సమ­ర్పిం­చ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­ము. దయ­చే­సి మాకు సా­యా­న్ని సమా­యా­ని­కి చే­యం­డి.' అంటూ ఎక్స్ అకౌం­ట్ నుం­చి ట్వీ­ట్ చే­శా­రు. 'మీ­రు నన్ను సం­ప్ర­దిం­చి­నం­దు­కు ధన్య­వా­దా­లు.. నా టీమ్ వెం­ట­నే ఈ అం­శా­న్ని పరి­శీ­లి­స్తుం­ది అవ­స­ర­మైన వి­వ­రా­లు అం­దిం­చం­డి' అంటూ లో­కే­ష్ ట్వీ­ట్ చే­శా­రు.

ఏపీకి మరో వందే భారత్ రైలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి మరో వందే భా­ర­త్ రైలు రా­నుం­ది. చె­న్నై-నర­సా­పు­రం వందే భా­ర­త్‌­కు రై­ల్వే శాఖ ఆమో­దం తె­లి­పిం­ద­ని కేం­ద్ర ఉక్కు, భారీ పరి­శ్ర­మల శాఖ సహా­య­మం­త్రి భూ­ప­తి­రా­జు శ్రీ­ని­వా­స­వ­ర్మ తె­లి­పా­రు. త్వ­ర­లో­నే నర­సా­పు­రం నుం­చి చె­న్నై­కి వందే భా­ర­త్ రై­లు­ను ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు పే­ర్కొ­న్నా­రు. కేం­ద్ర మం­త్రి శ్రీ­ని­వాస వర్మ కృ­షి­ని బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు పీ­వీ­ఎ­న్ మా­ధ­వ్ అభి­నం­దిం­చా­రు. వందే భా­ర­త్ రైలు రా­క­పై ప్ర­యా­ణి­కు­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. భూ­ప­తి­రా­జు­పై ప్ర­శం­స­లు కు­రి­పి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News