వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా- లోకేష్
ఈనెల 14న ప్రమాణం చేద్దామంటూ వారం కిందటే సీఎం జగన్‌కు సవాల్ విసిరిన లోకేష్.. అందులో భాగంగానే ఈరోజు అలిపిరి;
తిరుపతి వేదికగా సవాళ్ల పర్వం నడుస్తోంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలిపిరి వద్ద వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో కలిసి లోకేష్ అలిపిరి వెళ్తున్నారు.. వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేస్తానని లోకేష్ చెప్తున్నారు..
అదే సమయంలో జగన్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.. ఈనెల 14న ప్రమాణం చేద్దామంటూ వారం కిందటే సీఎం జగన్‌కు సవాల్ విసిరిన లోకేష్.. అందులో భాగంగానే ఈరోజు అలిపిరి వెళ్లి ప్రమాణం చేయనున్నారు. లోకేష్ వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అలిపిరి చేరుకుంటున్నారు..