LOKESH: "బాధితులందరినీ ఏపీకి తీసుకొస్తాం"
నేపాల్‌లో చిక్కుకున్న వారికి నారా లోకేశ్ భరోసా
కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేపాల్‌లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేశ్‌కు వివరించారు. మంత్రి నేపాల్‌లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో వీడియో కాల్లో మాట్లాడారు. మహిళలు సూర్యప్రభ, రోజారాణి అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు.
నేపాల్ లో ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 215 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సిమిల్ కోట్ లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరందరినీ ఢిల్లీలో ప్రత్యేక ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.