LOKESH: రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోంది
ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం
"రెడ్‌బుక్ తన పని తాను చేసుకుపోతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు.” అని నారా లోకేశ్ స్పష్టం చేశార. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘అమెరికాలో తెలుగువాళ్లు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వాళ్లు వై నాట్ 175 అన్నారు.. ప్రజలు మాత్రం వై నాట్ 11 అన్నారు. ప్రవాసాంధ్రులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ అండగా ఉంటుంది. విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా ఎన్డీయే కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. రెడ్‌బుక్ తన పని తాను చేసుకుపోతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు. చంద్రబాబుని 53 రోజులు పాటు అక్రమంగా జైలులో ఉంచినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం సిద్ధం అని బయలుదేరిన పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. అని నారా లోకేశ్ వెల్లడించారు.
ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయింది. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరగరాస్తాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం’’ అని లోకేశ్ అన్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనంతో పాటు లోకేశ్‌తో ఫొటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. ఏపీ ఎగుమతులు - దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేశ్ సోమ, మంగళవారాల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఆయన పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ డా.వేమూరు రవికుమార్, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, ఎన్నారై లోకేశ్ నాయుడు కొణిదెల, రాజాపిల్లి, సతీష్ మండువ, తదితరులు సమన్వయపరుస్తున్నారు.