Andhra Pradesh News : జగన్ కు లోకేష్‌ సవాల్.. వైసీపీ అధినేత ముందుకొస్తారా..?

Update: 2025-11-04 07:37 GMT

ఇప్పుడు ఏపీలో కల్తీ మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ కల్తీమద్యం విషయంలో చాలా రచ్చ జరుగుతోంది. అయితే ముందు తనకేం తెలియదని బిల్డప్ ఇచ్చిన జోగి రమేశ్.. దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లి సత్యహరిశ్చంద్రుడి రేంజ్ లో ప్రమాణం చేశారు. తీరా చూస్తే ఆధారాలతో సహా దొరికిపోయారు. కాల్ రికార్డింగులు, సీసీ ఫుటేజీలు అన్నీ బయటకొస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో జోగి రమేశ్ చేసిన సవాల్ ఒకదాన్ని వైసీపీ నేతలు బాగా తెరమీదకు తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం కల్తీమద్యం అమ్మట్లేదని లోకేష్ ప్రమాణం చేయగలరా అంటూ జోగి రమేశ్ అన్న విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా లోకేష్ స్పందించారు. దానికి తాను సిద్ధమే అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీమద్యం తయారు చేయట్లేదని తాను ప్రమాణం చేస్తానన్నారు. వైసీపీ హయాంలో కల్తీమద్యం విషయంలో ముడుపులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు లోకేష్. అంటే కల్తీమద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు జగనే అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు లోకేష్. మైలవరం జనసేన నేతలు ఏం చెబుతున్నారంటే జోగి రమేశ్ క్రైస్తవుడు.. ఆయనకు దుర్గామాత అంటే నమ్మకం లేదు కాబట్టే ఇలాంటి ప్రమాణం చేశారని అంటున్నారు. కానీ లోకేష్ అలా కాదు కదా. అందుకే ఆయన ఆలయంలో ప్రమాణం చేస్తానంటున్నారు.

మరి ఈ సవాల్ ను జగన్ స్వీకరిస్తారా.. నిజంగానే లోకేష్ సవాల్ ను స్వీకరించి ముందుకు వస్తారా అంటే డౌటే. ఎందుకంటే గతంలో కల్తీ లడ్డూ విషయంలో తిరుమలకు వచ్చి డిక్లరేషన్ ఇస్తానని చెప్పాడు. కానీ రాకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు కల్తీమద్యం కేసుపై మొదటి నుంచి జగన్ రకరకాల అబద్దాలే మాట్లాడుతున్నారు. తన మీదకు ఏదైనా ఇష్యూ వస్తోందంటే తప్పించుకుని తిరగడంలో జగన్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు కల్తీమద్యం కేసులో ఆయన చేస్తోంది అదే. కాబట్టి లోకేష్ సవాల్ ను జగన్ స్వీకరించే అవకాశాలు అసలే లేవంటున్నారు కూటమి నేతలు. నిజాన్ని ఒప్పుకోవడం జగన్ కు రాదు కాబట్టి ఈ విషయంలో ఏదో ఒకటి డైవర్ట్ చేసేస్తారని అంటున్నారు.


Full View

Tags:    

Similar News