Lookout Notice: పేర్ని నాని భార్యపై లుకౌట్ నోటీసు

10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో;

Update: 2024-12-23 05:45 GMT

రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా మానస కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడూ చట్టం గురించి నీతులు చెప్పే నాని.. ఇప్పుడు చట్టంలో ఆటలాడుతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

పేర్ని నానిని ఉరి తీయాలి: బుద్ధా వెంకన్న

మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న పేర్ని నానిని ఉరితీయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకొచ్చి కూటమి నేతలపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కులాల పేరుతో రెచ్చగొట్టే నాని.. ఇప్పుడు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నాని అనే పందికొక్కు అమ్మేసుకుందని విమర్శించారు.

Tags:    

Similar News