Viral : మొక్కు తీరిందని 151 మేకలను బలిచ్చిన లారీ డ్రైవర్

Update: 2025-09-17 08:52 GMT

తన ఆరోగ్య సమస్యలు తీరినందుకు ధర్మపురి జిల్లాకు చెందిన ఒక లారీ డ్రైవర్ అసాధారణ రీతిలో మొక్కు చెల్లించుకున్నారు. పెన్నాగరం తాలూకా, అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ అనే లారీ డ్రైవర్, ఆరు సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న ముత్తు మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు.

ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో తన మొక్కును చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ.10 లక్షలు వెచ్చించి 151 మేకలను కొనుగోలు చేశారు. మంగళవారం ఆ మేకలను ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి బలిచ్చి, అక్కడికి వచ్చిన భక్తులందరికీ మాంసాహారంతో విందు ఏర్పాటు చేశారు. ఒక సాధారణ లారీ డ్రైవర్ తన మొక్కు తీరినందుకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మొక్కు చెల్లించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆ భక్తుడి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది.

Tags:    

Similar News