West Godavari : బైక్ ను ఢీకొన్న లారీ...ఇద్దరు యువకులు మృతి...

Update: 2025-07-21 12:45 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్డు లో బైక్ ను వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ అతి వేగం తో డీ కొట్టడంతో బైక్ నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News