బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌పై ఎక్కువగా ఉంటుందని, APపై అంతగా ఉండదని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఇవాళ రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షం, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
మరోవైపు తెలంగాణలో ఈరోజు7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. నిన్న హైదరాబాద్ సహా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో జోరు వాన పడింది. కుమురంభీం,ఆసిఫాబాద్, చోర్‌పల్లిలో పిడుగుపాటుతో అంజన్న మృతి చెందారు.