ఏపీలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ్టి నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనంతపురం తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.