ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కర్నూలు జిల్లా గూడూరు గ్రామానికి చెందిన పుట్టపాసం రఘు అనే యువకుడిని బుధవారం గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఓ ట్విట్టర్ ఖాతా నుండి పవన్ కల్యాణ్ కుమారుడు చనిపోయినట్లు రఘు పోస్టులు పెట్టాడు. వెంటనే ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మెరికనపల్లి సాంబశివరావు, జనసేన పార్టీ నేతలు ఈ పోస్ట్ ను చూసి ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ భానోదయ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై నాగేంద్రం దర్యాప్తు చేసి, రఘును అదుపులోకి తీసుకున్నారు.