MANA MITRA: మన మిత్రలో మరిన్ని సేవలు
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇక 700 రకాల సేవలు.. ఇప్పటికే 500 రకాల సేవలు అందిస్తున్న ఏపీ సర్కార్... ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు;
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో పౌరసేవలను 700లకు పెంచాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 700 పౌర సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను జనవరిలో ప్రారంభించారు. 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కాగా.. ఈ సేవలను క్రమంగా వేయికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సేవలకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా వాటిని ఇంటినుంచే పొందేందుకు రాష్ట్రప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. మనమిత్ర పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ పౌరసేవలు అందిస్తున్న ప్రభుత్వం వాటిని 700కు పెంచాలని నిర్ణయించింది. ఈనెల 15వ తేదీనుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సేవలను అందించేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలతో 'మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్' ప్రారంభం కాగా, సేవలను క్రమంగా పెంచారు. ప్రస్తుతం 500 సేవల దాకా అందుతున్నాయి. వీటిని 15వ తేది నుంచి 700దాకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల సంఖ్యను 700లకు పెంచాలని నిర్ణయించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. 9552300009 నంబర్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, ప్రజలకు
రేషన్ కార్డుల సేవలు, తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం స్టేటస్, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. అలాగే ఆర్టీసీ బస్ టికెట్ల నుంచి దేవాలయాల సేవల వరకూ.. రెవెన్యూ సేవల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపుల వరకూ అనేక సేవలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. 2025 జనవరిలో 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మొదలైంది. క్రమంగా ఈ సేవల సంఖ్యను ప్రస్తుతం 500లకు చేర్చారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ సంఖ్యను 700 సేవలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. మన మిత్ర ద్వారా ప్రజలు ఇంటి దగ్గరే కూర్చునే అన్ని పనులు చేయవచ్చన్నారు.