ATTACK: మోహన్ బాబు బౌన్సర్ల దౌర్జన్యం

ఎఫ్5 రెస్టారెంట్‌లో బీభత్సం... మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు;

Update: 2025-02-14 07:30 GMT

ప్రముఖ నటుడు మోహన్ బాబు బౌన్సర్లు...తిరుపతిలో రెచ్చిపోయారు. మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ఎఫ్5 రెస్టారెంట్‌లో బీభత్సం సృష్టించారు. రెస్టారెంట్‌లోని కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గురువారం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు.. రెస్టారెంట్ నిర్వాహకులకు గొడవ జరగడంతో విద్యార్థులు వర్సిటీలో ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బందితో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. రెస్టారెంట్ నిర్వాహకులకు మంచు మనోజ్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాయచోటిలో జగన్నాథ్ మూవీ టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్.. తాను చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదన్నాడు. తాను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని.. అది బయట వారైనా సరే.. ఇంటివారైనా సరే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా మంచు విష్ణు, కన్నప్ప సినిమాపైనా విమర్శలు గుప్పించాడు.

నన్ను తొక్కేయాలని చూస్తున్నారు: మంచు మనోజ్

‘జగన్నాథ్‌’ సినిమా టీజర్‌ విడుదల వేడుకలో హీరో మంచు మనోజ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘నన్ను ఎంతో మంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరు. ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించడం తేలిక కాదు. రూ. కోటితో తీసినంత మాత్రాన చిన్న సినిమా కాదు, రూ. వేల కోట్లతో తీసినంత మాత్రాన పెద్ద సినిమా అయిపోదు. సినిమా అంటే సినిమానే. బాగుందా, లేదా? అనేది ముఖ్యం’ అని చెప్పారు.

Tags:    

Similar News