Maoist Surrender : వెట్టిచాకిరి భరించలేక మావోయిస్టు లొంగుబాటు..

Maoist Surrender : దళంలో వెట్టిచాకిరి భరించలేక మావోయిస్టు సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు;

Update: 2022-09-24 09:30 GMT

Maoist Surrender : దళంలో వెట్టిచాకిరి భరించలేక మావోయిస్టు సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. ఎటపాక మండలం దొంగలజగ్గరం గ్రామానికి చెందిన అడమయ్య..మూడేళ్లక్రితం శబరిదళంలో చేరాడు. దళంలో హైకమాండ్ చేయించే వెట్టిచాకిరి, బట్టలు ఉతకడం, వంటపనులుచేయడంతో విసిగిపోయి లొంగిపోయినట్లు అడమయ్య తెలిపారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్ ముందు సరేండర్ అయ్యారు. మావోలు జనజీవన శ్రవంతిలో కలువాలని.. వారికి అన్నివిధాలుగా సహకరిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. దళంలో వెట్టిచాకిరి భరించలేక లొంగిపోయిన మావోయిస్టు సరేండర్ అయిన దొంగలజగ్గరం గ్రామానికి చెందిన అడమయ్య మూడేళ్లక్రితం దళంలో చేరిన అడమయ్య బట్టలు ఉతకడం, వంటచేయడంతో విసిగిపోయానన్న అడమయ్య.

Tags:    

Similar News