Visakhapatnam: విశాఖ బీచ్‌లో అదృశ్యమైన వివాహిత ప్రియుడితో ప్రత్యక్షం..
Visakhapatnam: సినిమాను తలపించిన ట్విస్ట్ విశాఖ వివాహిత విషయంలో చోటు చేసుకుంది. పెళ్లి రోజని భార్యాభర్తలు బీచ్‌కి వెళ్లారు..;
Visakhapatnam: సినిమాను తలపించిన ట్విస్ట్ విశాఖ వివాహిత విషయంలో చోటు చేసుకుంది. పెళ్లి రోజని భార్యాభర్తలు బీచ్‌కి వెళ్లారు.. అక్కడ భర్త ఫోన్ మాట్లాడుతుండగా భార్య ప్రియుడితో జంప్ అయింది.. విషయం తెలియని భర్త.. భార్య సముద్రంలో కొట్టుకుపోయిందేమో అని బాధపడుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.. రెండు రోజుల గాలింపు తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు పోలీసులు..
అదృశ్యమైన సాయిప్రియ ప్రియుడితో కలిసి బెంగళూరులో ఉన్నానని తమకి పెళ్లి కూడా అయిందని, తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. శుక్రవారం ప్రియుడు రవితో కలిసి విశాఖలోని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తమకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని ఆ జంట పోలీసులను కోరింది.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు జంట వివరాలను నమోదు చేసుకున్నారు. ఇరుకుటుంబాల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు.. తమ బిడ్డలు చేసిన పనికి తలదించుకోవాల్సి వచ్చిందని, వారిని ఇళ్లకు తీసుకెళ్లబోమని స్పష్టం చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు రవి, సాయిప్రియలను స్టేషన్ నుంచి పంపించివేశారు.